శరణం శరణం శ్రీ హనుమ
స్వామి శరణం శరణమయా
శరణం శరణం శ్రీ హనుమ
స్వామి శరణం శరణమయా
1. మారుతీ మహిమలు వినరండి
హనుమత్ గానం చేయండి
భజనలు చేయగా రారండి
జయ జయ హనుమ అనరండి //శ //
2. అంజని గర్భము ఉదయించి
సూర్యుని మింగగా తానేంచి
అంబర వీధికి ఎగిసేనంత
ఫలమని భ్రమసి ఆనాడే //శ //
3. వరముల వెలసెను మారుతియే
బ్రహ్మ జ్ఞానీ చిరయువుగా
ఆశీర్వచనము చేసిరిగా
బాల హనుమను దేవతలే //శ //
4. ప్రియ సఖునిగా సుగ్రీవునికే
మంత్రివర్యుడై మారుతియే
వాలిని పరిమార్చుట కొరకై
రాముని సాయం వాడేనట //శ //
5. రామభద్రుడే కరుణించి
వాలిని శరముల వదియించి
సుగ్రీవుని రారాజుగానే
చేసెను మారుతీ సాయముతో //శ //
6. సీతాన్వేషణ గావింప
వనరసేనతో వేడలేనుగా
జాడ తెలిపే ఆ జటాయువే
లంకకు చేరెను సీతయని //శ //
7. సంద్రము దాటగా సాహసియీ
ఎవరని వెతికిరి వానరులే
చేరెను హనుమను కపివరులు
స్రుగీంచిరి ఇక నీవే అని //శ //
8. రామ భధ్రుడే ఆవేదన తో
ముద్రిక నిడేనట మారుతీ కే
సీత జాడను తెలుసుకొని
ముద్రిక నిమ్మని కోరేనట //శ //
9. ఆకాశ వీధీన ఎగిరేనట
బంధించెను ఆ సేతువునే
లంకను చేరెను కపివరుడే
లంకిణి కూల్చెను రౌద్రుండై //శ //
10. అశోక వనినే జానకిని
సూక్ష్మ రూపుడై చూచెనటా
ముద్రికనిడి ఆ జానకితో
రామ వృతాంత్తము తెలిపెనట //శ //
11. సీత శిరోమణి ఓసగెనట
బయలు దేరేనట వేగముగా
లంకను గాల్చి తన వాలముతో
చేరెను రాముని సన్నిధికే //శ //
12. రామ రావణ యుద్దములో
చీల్చి చెండాడే అసురులను
రావణ సంహారము కాగా
రాముని సీతను కలిపెనట // శ //
13. వైభోగముగా జరిగేనుగా
అయోధ్య పురిలో వేడుకగా
రామ పట్టబిషేకమునే
జరిపెను హనుమ పవనియీ //శ //
14. రామనామమే తారకమై
ఆ చంద్రార్కము నిలిచెనుగా
ఆంజనేయుడే వారదిగా
రామయణమే వేలిసేనుగా //శ //
15. నిను దర్శించుట మా భాగ్యం
నిను సేవించుట సౌభాగ్యం
పూజలు చేయుట పుణ్యఫలం
నీ చిత్తము నా నోము ఫలం //శ //
16. కర్పూర హారతి తనకెంతో
పానక మంటే మరిఎంతో
తారక మంటే ఎంతెంతో
ఇష్టం ఇష్టం స్వామీకి //శ //