Monday, 16 March 2015

SRINIVASA GAYATRI MANTRAM

శ్లో ll      నిరంజనాయ  విద్మహే
           నిరాభాసాయ  ధీమహీ
           తన్నో శ్రీనివాస ప్రచోదయాత్                     

Sunday, 22 February 2015

SHUDDHA TADHIYA CHANDRA DARSHANA NAMASKARA PHALITAM


 చంద్ర దర్శనమునకు  ముందుగా మన దగ్గర ఉన్న
 వస్త్రం నుండి ఒక్క నూలుపోగు తీసి,
 ఆ నూలుపోగుని చంద్రునికి చూప్పిస్తూ           
 ఈ క్రింది విధముగా  ఉన్నది
 చదువుకొని  చంద్రుడుకి నమస్కారం చేయాలి.  . 
  1. శుద్ధ  తదియ నాటి  చంద్ర  దర్శనం మహా భాగ్యం,
  2. మా అమ్మకు తమ్ముడువై ,
  3. నాకు మేనమామవై ,
  4. ఈ నూలు వస్త్రము తీసుకొని,
  5. పట్టు వస్త్రములు నాకు ఇవ్వు,
  6. చంద్రదర్శనం చేసిన వేంటనే బంగారాన్ని చూడాలి .
  7. ఈ విధముగా చేయుట వలన సంపద కలుగుతుంది. 

Monday, 19 January 2015

SRI HANUMAN SARANAM SARANAM DEVOTIONAL SONG



        శరణం శరణం శ్రీ హనుమ
       స్వామి శరణం శరణమయా
      శరణం శరణం శ్రీ హనుమ
      స్వామి శరణం శరణమయా

1.   మారుతీ మహిమలు వినరండి
      హనుమత్ గానం చేయండి
      భజనలు చేయగా రారండి
      జయ జయ హనుమ అనరండి //శ //

2.    అంజని గర్భము ఉదయించి
       సూర్యుని మింగగా తానేంచి
       అంబర వీధికి ఎగిసేనంత
       ఫలమని భ్రమసి ఆనాడే //శ //

3.    వరముల వెలసెను మారుతియే
       బ్రహ్మ జ్ఞానీ చిరయువుగా
       ఆశీర్వచనము చేసిరిగా
        బాల హనుమను దేవతలే //శ //

4.    ప్రియ సఖునిగా సుగ్రీవునికే
       మంత్రివర్యుడై  మారుతియే
       వాలిని పరిమార్చుట కొరకై
       రాముని సాయం వాడేనట //శ //

5.    రామభద్రుడే కరుణించి
        వాలిని శరముల వదియించి
        సుగ్రీవుని రారాజుగానే
        చేసెను మారుతీ సాయముతో //శ //

6.     సీతాన్వేషణ గావింప
       వనరసేనతో వేడలేనుగా
       జాడ తెలిపే ఆ జటాయువే
       లంకకు చేరెను సీతయని //శ //

7.     సంద్రము దాటగా సాహసియీ
        ఎవరని వెతికిరి వానరులే
        చేరెను హనుమను కపివరులు
        స్రుగీంచిరి ఇక నీవే అని //శ // 

8.    రామ భధ్రుడే  ఆవేదన తో
        ముద్రిక  నిడేనట  మారుతీ కే       
         సీత జాడను తెలుసుకొని
         ముద్రిక నిమ్మని కోరేనట  //శ //

9.     ఆకాశ వీధీన ఎగిరేనట 
         బంధించెను ఆ  సేతువునే                 
         లంకను చేరెను కపివరుడే                
         లంకిణి కూల్చెను రౌద్రుండై //శ //      

10.     అశోక  వనినే  జానకిని           
          సూక్ష్మ రూపుడై చూచెనటా    
          ముద్రికనిడి ఆ జానకితో
          రామ వృతాంత్తము తెలిపెనట //శ //

11.    సీత శిరోమణి ఓసగెనట
         బయలు దేరేనట వేగముగా
         లంకను గాల్చి తన వాలముతో   
         చేరెను రాముని సన్నిధికే //శ //

12.     రామ రావణ యుద్దములో
           చీల్చి చెండాడే అసురులను
           రావణ సంహారము కాగా
           రాముని సీతను కలిపెనట // శ //

13.    వైభోగముగా జరిగేనుగా
         అయోధ్య పురిలో వేడుకగా
         రామ పట్టబిషేకమునే
         జరిపెను  హనుమ పవనియీ //శ //   

14.    రామనామమే తారకమై
         ఆ చంద్రార్కము నిలిచెనుగా    
         ఆంజనేయుడే  వారదిగా             
         రామయణమే వేలిసేనుగా //శ //

15.    నిను దర్శించుట మా భాగ్యం 
         నిను సేవించుట సౌభాగ్యం
         పూజలు చేయుట  పుణ్యఫలం   
         నీ చిత్తము నా  నోము ఫలం //శ //         

16.   కర్పూర హారతి తనకెంతో
        పానక మంటే  మరిఎంతో
        తారక మంటే   ఎంతెంతో                 
        ఇష్టం ఇష్టం స్వామీకి //శ //